south central railway: రేపటి నుంచి 9వ తేదీ వరకు 24 రైళ్లు రద్దు
- ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం
- 22 ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా ఆపేస్తున్న రైల్వే శాఖ
- సహకరించాలంటూ ప్రయాణికులకు అధికారుల విజ్ఞప్తి
హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మెయింటనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు వివిధ రూట్లలో నడుస్తున్న 24 రైళ్లను ఆపేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా లింగంపల్లి, ఫలక్ నుమా, ఉందానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
రద్దు చేస్తున్న సర్వీసులు ఇవే..
కాజీపేట–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రాచలం–విజయవాడ, విజయవాడ–భద్రాచలం, సికింద్రాబాద్–వికారాబాద్, వికారాబాద్–కాచిగూడ, సికింద్రాబాద్–వరంగల్, వరంగల్–హైదరాబాద్, సిర్పూర్ టౌన్–కరీంనగర్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట–సిర్పూర్ టౌన్, బల్లార్షా–కాజీపేట, భద్రాచలం–బల్లార్షా, సిర్పూర్ టౌన్–భద్రాచలం, కాజీపేట–బల్లార్షా, కాచిగూడ–నిజామాబాద్, నిజామాబాద్–నాందేడ్.
అదేవిధంగా.. కాచిగూడ-మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ ఉందానగర్ వరకు, నాందేడ్–నిజామాబాద్-పండర్పూర్ ఎక్స్ ప్రెస్ ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తుందన్నారు.
22 ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా..
వివిధ రూట్లలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు,
లింగంపల్లి-ఉందానగర్ 3,
లింగంపల్లి-ఫలక్ నుమా 2,
ఉందానగర్-లింగంపల్లి 4,
ఫలక్ నుమా-లింగంపల్లి 2,
రామచంద్రాపురం-ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలు