hanu man: బడా స్టార్లతో ‘హను–మాన్’ ఢీ

HANU MAN to release on JAN 12th 2024

  • సంక్రాంతి బరిలో తేజ సజ్జ చిత్రం
  • జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటన
  • ప్రాజెక్ట్-కె, గుంటూరు కారం, ఈగల్ చిత్రాలతో పోటీ

యువ నటుడు తేజ సజ్జ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రం రూపొందుతోంది. తెలుగు నుంచి వస్తున్న ప్యాన్ వరల్డ్ చిత్రమిది. అమృత అయ్యర్ హీరోయిన్‌ గా నటిస్తున్న సినిమాను కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ వేసవిలో విడుదలవ్వాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఆలస్యం అయిన కారణంగా వాయిదా పడింది. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు దర్శకుడు ప్రశాంత్ తెలిపాడు. 

దాంతో, ఈ చిత్రం  ప్రభాస్ ‘ప్రాజెక్ట్. కె’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ రవితేజ ‘ఈగల్’ చిత్రాలను ఢీకొట్టనుంది. ఈ మూడు చిత్రాలతో పాటు ‘హను–మాన్’ వచ్చే సంక్రాంతికి బరిలో నిలవనుంది. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

hanu man
movie
Sankranti
2024
jan12
Prabhas
Mahesh Babu
Raviteja
teja sajja

More Telugu News