Pawan Kalyan: విజయవాడలో తొలిప్రేమ థియేటర్‌లో అభిమానుల అత్యుత్సాహం, స్క్రీన్ చించివేత

Fans destroy in tholiprema theatre

  • సినిమా ప్రదర్శితమవుతున్న కపర్ధి థియేటర్లో అభిమానుల అత్యుత్సాహం
  • శుక్రవారం రాత్రి సెకండ్ షో సమయంలో కొంతమంది బీభత్సం 
  • స్క్రీన్ ను చించేసి, సీట్లు ధ్వంసం

పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో కొంతమంది అభిమానులు థియేటర్లలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పాత సినిమాలకు 4కే హంగులు అద్ది కొత్త సినిమాల తరహాలో పలు సినిమాలను విడుదల చేస్తున్నారు. బిల్లా, సింహాంద్రి వంటి పలు హిట్ సినిమాలను రీ-రిలీజ్ చేశారు. 

ఇక పవన్ కల్యాణ్ సినిమాలు అంటే అభిమానుల సందడికి హద్దే ఉండదు. పవన్ తొలిప్రేమ సినిమాను కూడా జూన్ 30న రీ-రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద, లోపల అభిమానులు పవన్ నామ జపం చేస్తున్నారు. కొన్నిచోట్ల సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. 

అయితే విజయవాడలోని కపర్థి థియేటర్ లో పవన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి సెకండ్ షో సమయంలో కొంతమంది బీభత్సం సృష్టించారట. థియేటర్ లో స్క్రీన్ ను చించేసి, సీట్లను ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన థియేటర్ సిబ్బందిపై యువకులు దాడికి దిగారు. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని థియేటర్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది.

Pawan Kalyan
tholi prema
  • Loading...

More Telugu News