Bandi Sanjay: బీజేపీలో కీలక పరిణామాలు.. బండి సంజయ్ అసంతృప్తి

Telangana BJP Chief Bandi Sanjay Unhappy With Leaks

  • కావాలనే లీకులు ఇస్తున్నారని ఆవేదన
  • అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే కార్యకర్తగానే కొనసాగుతానని సహచరులతో చెప్పిన బండి
  • బండిని తప్పిస్తే పార్టీకి చేటేనన్న మాజీ మంత్రి విజయరామారావు

పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. బండికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కానీ, లేదంటే జాతీయ రాజకీయాల్లో కీలక పదవి కట్టబెట్టాలని కానీ బీజేపీ అధినాయకత్వం యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, కేంద్రమంత్రి, సీనియర్ నేత కిషన్‌రెడ్డికి తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలని కూడా నిర్ణయించారని, మూడునాలుగు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

రాష్ట్రంలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. అంతలోనే మళ్లీ అధ్యక్ష మార్పు వార్తలు రావడంపై బండి తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కావాలనే లీకులు ఇస్తున్నారని వాపోయారు. అంతేకాదు, పార్టీ బాధ్యతలు వేరే వారికి అప్పగిస్తే తాను కార్యకర్తగానే ఉంటానని చెప్పినట్టు సమాచారం. కాగా, సంజయ్‌ను కాదని వేరే వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే కొత్త చేరికలు ఉండవని, అంతేకాక పార్టీని వీడేవారు కూడా ఉంటారని మాజీ మంత్రి విజయరామారావు నిన్న ట్వీట్  చేశారు.

Bandi Sanjay
BJP
Telangana BJP
G. Kishan Reddy
  • Loading...

More Telugu News