Maharashtra: మహారాష్ట్రలో బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది సజీవ దహనం

25 People Killed After Bus Catches Fire in Maharashtra

  • ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు
  • తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన
  • గాయపడిన 8 మంది పరిస్థితి కూడా విషమం

మహారాష్ట్రలో ఓ బస్సులో మంటలు చెలరేగి 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్ నుంచి పూణె వెళ్తున్న బస్సు బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Maharashtra
Bus Catches Fire
Buldhana
Samruddhi Mahamarg Expressway
  • Loading...

More Telugu News