Tirumala: తిరుమల కొండపై మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ
- స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
- శిలాతోరణం వరకు ఉన్న క్యూలైన్
గత కొన్నిరోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి తక్కువగా నమోదైంది. అయితే నిన్న తొలి ఏకాదశి కావడం, వీకెండ్ కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దాంతో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. టోకెన్లు లేకుండా క్యూలైన్లలోకి వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు అన్నీ నిండిపోయి, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో ఉన్నారు.
నిన్న తిరుమల వెంకన్నను 62,005 మంది భక్తులు దర్శించుకోగా, 34,127 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్క రోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.75 కోట్ల ఆదాయం వచ్చింది.