Forest Lizard: తిరుమల శేషాచల అడవుల్లో అరుదైన సరీసృపం

Forest lizard found in Tirumala forest

  • పలు అరుదైన జీవులకు ఆవాసంగా శేషాచల అడవులు
  • తాజాగా ఫారెస్ట్ లిజార్డ్ గుర్తింపు
  • పెద్ద పెద్ద కొండలు ఉండే చోట నివసించే అరుదైన జీవి

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొలువై ఉన్న శేషాచల అడవులు పలు అరుదైన జీవులకు ఆవాసంగా ఉన్నాయి. తాజాగా ఒక అరుదైన సరీసృపాన్ని కూడా శేషాచల అడవుల్లో గుర్తించారు. ఇది ఒక తొండ జాతికి చెందినది. దీన్ని ఫారెస్ట్ లిజార్డ్ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో కనిపించే ఈ జీవి పెద్ద పెద్ద కొండలు ఉన్న ప్రదేశాల్లో దర్శనమిస్తుంది. 

వీపుపై వెంకటేశ్వరస్వామి నామం వంటి గీతలు, వాటి మధ్యలో తిలకం దిద్దినట్టుగా మరో గీత, మిగతా భాగం నారింజ, నలుపు వర్ణాల్లో ఉంటుంది. మిగతా తొండలకు భిన్నంగా దీని చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. ఈ ఫారెస్ట్ లిజార్డ్ కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది.

Forest Lizard
Tirumala
Seshachala Forest
Rare Species
  • Loading...

More Telugu News