post office: గుడ్‌న్యూస్: ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేట్ల పెంపు

Govt Raises Interest Rates On Small Savings Schemes

  • జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి పలు పథకాలపై పెంపు
  • ఏడాది, రెండేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల పెంపు
  • 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్లపై 30 బేసిస్ పాయింట్ల పెంపు

జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి కొన్ని చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం శుక్రవారం వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది, రెండేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్లను పెంచడంతో వడ్డీ రేట్లు వరుసగా 6.9 శాతం, 7.0 శాతానికి పెరిగాయి. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీని 30 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి సవరించింది. ఇతర పథకాలపై రేట్లు మారవని స్పష్టం చేసింది. 

2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం... జులై 1, 2023 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 30, 2023తో ముగుస్తుంది. ఈ కాలానికి గాను వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు సవరించడం జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక మెమోరాండమ్‌లో తెలిపింది.

వివిధ స్మాల్ సేవింగ్స్ పై పెరిగిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి....

ఏడాది కాలపరిమితి పోస్టాఫీస్ డిపాజిట్‌పై 6.9 శాతం
రెండేళ్ల కాలపరిమితి పోస్టాఫీస్ డిపాజిట్‌పై 7.0 శాతం
మూడేళ్ల కాలపరిమితి పోస్టాఫీస్ డిపాజిట్‌పై 7.0 శాతం
ఐదేళ్ల కాలపరిమితి పోస్టాఫీస్ డిపాజిట్‌పై 7.5 శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) 7.7 శాతం
కిసాన్ వికాస్ పత్ర 7.5 శాతం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - 7.1 శాతం
సుకన్య సమృద్ధి యోజన 8.0 శాతం
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 8.2 శాతం
మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ 7.4 శాతం

  • Loading...

More Telugu News