Saichand: తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ అంత్యక్రియలపై కాంగ్రెస్ విమర్శలు

Congress party questions Telangana govt on Saichand funerals
  • గుండెపోటుతో మరణించిన సాయిచంద్
  • నిన్న వనస్థలిపురం సాహెబ్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదన్న కాంగ్రెస్
  • గతంలో సాయన్న అంత్యక్రియల్లోనూ అధికారిక లాంఛనాలు లేవని ఆరోపణ
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తెలిసిందే. సాయిచంద్ అంత్యక్రియలు నిన్న హైదరాబాద్ శివారు వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ శ్మశానవాటికలో జరిగాయి. 

అయితే, సాయిచంద్ అంత్యక్రియలపై వివాదం ఏర్పడింది. ఉద్యమకారుడు సాయిచంద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించలేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే సాయన్న మృతి సమయంలోనూ ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు దళితులను అవమానించడమేనని విమర్శించారు. ఏపీ ప్రముఖులకు, నిజాం వారసులకు ఇచ్చిన గౌరవం దళిత నేతలకు కేసీఆర్ ఇవ్వడంలేదని పేర్కొన్నారు.
Saichand
Funerals
State Proceedings
Congress
BRS
Telangana

More Telugu News