Ramcharan: రామ్ చరణ్, ఉపాసనల కూతురి బారసాల నేడే.. ఏర్పాట్లకు సంబంధించిన వీడియో ఇదిగో!

Ram Charan and Upasana cradle ceremony

  • ఈ నెల 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
  • చిన్నారికి ఈరోజు పేరు పెట్టే అవకాశం
  • బారసాల కార్యక్రమానికి హాజరుకానున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు

రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ నెల 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తలిసిందే. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది. మరోవైపు చిన్నారి బారసాలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. మెగా ప్రిన్సెస్ బారసాలకు చెందిన ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరుకానున్నారు. 

మరోవైపు చిన్నారికి పెట్టబోయే పేరును ఇప్పటికే ఫిక్స్ చేశారు. చిరంజీవి కుటుంబం ఆంజనేయస్వామిని అత్యంత భక్తితో కొలుస్తుంది. ఈ నేపథ్యంలో, చిన్నారికి ఆంజనేయుడి పేరు కలిసేలా పేరు పెట్టొచ్చని తెలుస్తోంది. మెగా ప్రిన్సెస్ కు ఈరోజు పేరు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. చిన్నారి బాలసాల ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను వీక్షించండి. 


More Telugu News