Kamal Haasan: శంకర్ కు ఖరీదైన బహుమతిని ఇచ్చిన కమలహాసన్ 

Kamal Haasan costly gift to Shankar

  • కమల్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'భారతీయుడు 2'
  • మేజర్ సీన్స్ చూసి సంతృప్తిని వ్యక్తం చేసిన కమలహాసన్
  • శంకర్ కు రూ. 8 లక్షల విలువైన వాచ్ బహూకరణ

గతంలో వచ్చిన కమలహాసన్ 'భారతీయుడు' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా దర్శకుడు శంకర్ 'భారతీయుడు 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలోని మేజర్ సీన్స్ చూసిన కమలహాసన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు శంకర్ కు ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ వాచ్ ధర సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని చెపుతున్నారు. కమల్ తనకు గిఫ్ట్ ఇవ్వడంపై శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన మనసు ఆనందంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. మరోవైపు రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్లో శంకర్ మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Kamal Haasan
Shankar
Gift
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News