Somu Veerraju: కేంద్ర పథకాలపై మీ స్టిక్కర్లు ఏంటి?: సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖాస్త్రం

Somu Veerraju wrote CM Jagan

  • బియ్యం ఉచితంగా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమన్న వీర్రాజు
  • కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం
  • ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపేయాలని హితవు
  • కేంద్రమే బియ్యం ఇస్తున్నట్టు బోర్డులు పెట్టాలని డిమాండ్

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖల పర్వం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్ కు ఆయన మరో లేఖ రాశారు. కేంద్ర పథకాలపై మీ స్టిక్కర్లు ఏంటి? అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పథకంపై రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ ఎలా అంటిస్తారని సోము వీర్రాజు ప్రశ్నించారు.

బియ్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. 

ఉచిత బియ్యం అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని రేషన్ బియ్యం వాహనాలపై ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కేంద్ర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మార్గదర్శకాలు అమలు చేయాలని తెలిపారు.
.

Somu Veerraju
Jagan
Letter
Center Schemes
BJP
YSRCP
  • Loading...

More Telugu News