Paki: పాకిస్థాన్‌లో ఘోరం.. నిద్రిస్తున్న 9 మంది కుటుంబ సభ్యుల కాల్చివేత

9 Family Members Shot Dead In Pakistan

  • వివాహ విషయంలో గొడవ
  • బంధువుల ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు
  • నిందితుల కోసం కొనసాగుతున్న వేట

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఘోరం జరిగింది. వివాహ విషయంలో జరిగిన గొడవలో నిద్రిస్తున్న ఓ కుటుంబాన్ని బంధువులు తుపాకితో కాల్చి చంపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఆరుగురు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. మలాకండ్ జిల్లాలోని బత్కేలా తెహసీల్‌లో జరిగిందీ ఘటన. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. 

పోలీసుల కథనం ప్రకారం.. ఈ హత్యలకు వివాహ వివాదమే కారణమని పోలీసులు తెలిపారు. బాధితుల ఇంట్లోకి చొరబడిన నిందితులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్టు చెప్పారు. ఘటన తర్వాత పరారైన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు జిల్లా సరిహద్దులను మూసివేశారు. నిందితులను అరెస్ట్ చేసి శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రావిన్షియల్ కేర్ టేకర్ సీఎం ముహమ్మద్ అజామ్ ఖాన్ హామీ ఇచ్చారు.

Paki
Khyber Pakhtunkhwa
Marriage Dispute
Crime News
  • Loading...

More Telugu News