Chiranjeevi: తెరపై మళ్లీ సందడి చేయనున్న చిరంజీవి-త్రిష జోడీ!

Trisha to unite with chiranjeevi onscreen after 16 years
  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా 
  • చిరంజీవి సరసన నాయికగా త్రిష
  • మరో ప్రధాన పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ
  • సిద్ధు సరసన శ్రీలీల
మెగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్! మెగాస్టార్ చిరంజీవి, నటి త్రిష 16 ఏళ్ల తరువాత మళ్లీ వెండితెరపై జోడీ కట్టనున్నారు. చిరంజీవి హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోందన్న వార్త ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు  జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

ఈ మూవీలో చిరంజీవి సరసన ప్రముఖ నటి త్రిష కనిపించనుందని సమాచారం. సిద్ధూకు జోడీగా శ్రీలీల నటిస్తుందట. ఈ సినిమాను చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారని, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. 2006లో విడుదలైన స్టాలిన్ సినిమాలో చిరంజీవి, త్రిష జంటగా నటించిన విషయం తెలిసిందే. తాజా సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Chiranjeevi
Trisha

More Telugu News