Iswarya Menon: ఐశ్వర్య మీనన్ కి అదృష్టం కలిసొచ్చేనా?

- 2012లో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్య మీనన్
- పదేళ్లలో చేసిన సినిమాలు పది మాత్రమే
- ఇంతవరకూ తెలుగు సినిమాల వైపు చూడని భామ
- 'స్పై' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
ఒకప్పుడు కథానాయికలు ఒక భాషలో స్టార్ స్టేటస్ ను అందుకున్న తరువాత, ఇతర భాషలపై దృష్టిపెట్టేవారు. శ్రీదేవి .. జయప్రద, ఈ మధ్య తమన్నా .. కాజల్ ఈ పద్ధతిని ఫాలో అయినవారే. ఇక మరికొంతమంది కథానాయికలు, ఒక భాషకి చెందిన సినిమాలను పట్టుకుని ఉండరు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్లిపోతుంటారు.
ఇక మూడో వర్గానికి చెందిన కథానాయికలు, అవకాశాల కోసం గుమ్మంలో వెయిట్ చేస్తారు తప్ప .. ఎదురెళ్లరు. ఇలాంటి కథానాయికలు చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు. అలాంటి కథానాయికల జాబితాలో ఐశ్వర్య మీనన్ కూడా కనిపిస్తుంది. కోలీవుడ్ లో 2012లోనే ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, పదేళ్లలో పదే సినిమాలు చేయడం ఆశ్చర్యం.
