Peethala Sujatha: అమ్మఒడిని మోసపు ఒడిగా మార్చారు: పీతల సుజాత

Peethala Sujatha slams YCP govt

  • వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి
  • ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే అమ్మఒడి ఇస్తున్నారని విమర్శలు
  • 84 లక్షల మంది విద్యార్థులుంటే 42 లక్షల మందికే ఇస్తున్నారని ఆగ్రహం
  • టీడీపీ వస్తే, ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామని వెల్లడి

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. అమ్మఒడిని మోసపు ఒడిగా మార్చారని విమర్శించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే అమ్మఒడి ఇస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులుంటే 42 లక్షల మందికే అమ్మఒడి వర్తింపజేస్తున్నారని పీతల సుజాత వివరించారు. అమ్మఒడి లబ్దిదారులను ప్రతి ఏడాది తగ్గిస్తూ ఉండడం సిగ్గుచేటని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరిట ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. 

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో పార్టీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తల్లికి వందనం కూడా ఒకటి. ఈ పథకంలో... ఇంట్లో ముగ్గురు పిల్లలు చదువుకుంటుంటే వారికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.45 వేలు ఇస్తారు.

Peethala Sujatha
Amma Odi
Thalliki Vandanam
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News