Tarun Chugh: తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు అంటూ ప్రచారం... స్పష్టత ఇచ్చిన తరుణ్ చుగ్

Tarun Chugh clarifies on Telangana BJP leadership change
  • ఈ కథనాల్లో నిజం లేదన్న తరుణ్ చుగ్
  • తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ కొనసాగుతారని స్పష్టీకరణ
  • అధ్యక్షుడి మార్పు అంటూ ప్రచారం చేయడం సరికాదన్న తెలంగాణ బీజేపీ ఇన్చార్జి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని మార్చుతున్నారని, రాష్ట్ర బీజేపీలో సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదని ఫోన్ ద్వారా స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణ చీఫ్ గా బండి సంజయ్ కొనసాగుతారని వెల్లడించారు. 

అధ్యక్షుడి మార్పు అంశంపై పదే పదే ప్రచారం చేయడం సరికాదని తరుణ్ చుగ్ అన్నారు. దీనిపై ఇంతకుముందే స్పష్టత ఇచ్చామని, అయినా ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదని తెలిపారు. 

కాగా, ఇటీవల పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు తథ్యమని కొన్ని కథనాలు, బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారంటూ మరికొన్ని కథనాలు రావడం తెలిసిందే.
Tarun Chugh
Telngana BJP
Bandi Sanjay

More Telugu News