Mahindra Scorpio: అమ్మకాల్లో మహీంద్రా స్కార్పియో రికార్డు
![Mahindra Scorpio SUV hits major sales milestone](https://imgd.ap7am.com/thumbnail/cr-20230628tn649becffe4140.jpg)
- 9 లక్షల మార్క్ ను చేరుకున్న కంపెనీ
- ఇటీవలే చకాన్ ప్లాంట్ లో తయారైన 9 వ లక్ష కారు
- ఒక్క మే నెలలోనే 9,318 యూనిట్ల స్కార్పియో విక్రయాలు
మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎస్ యూ వీ స్కార్పియో అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 9వ లక్ష స్కార్పియో ఎన్ మోడల్ తాజాగా పుణెలోకి చకాన్ కేంద్రం నుంచి బయటకు వచ్చింది. స్కార్పియోని కొత్త రూపంలో స్కార్పియో ఎన్ గా గతేడాది జూన్ లో మహీంద్రా విడుదల చేసింది. వాస్తవానికి 2002లో స్కార్పియో మొదటి సారి భారత మార్కెట్లోకి రాగా, అప్పటి నుంచి ఎన్నో మార్పులకు గురవుతూ వచ్చింది.