Padma Jayanthi: వేణుమాధవ్ ఎలాంటి సాయం చేయలేదు: నటి పద్మ జయంతి

Padma Jayanthi Intterview

  • కేరక్టర్ ఆర్టిస్టుగా పద్మ జయంతికి పేరు 
  • తన భర్తకి వేణుమాధవ్ తో గల స్నేహం గురించి ప్రస్తావన
  • వేణుమాధవ్ ఎలాంటి సాయం చేయలేదని వెల్లడి 
  • తన దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదని వ్యాఖ్య    


కొంతకాలం క్రితం వరకూ కేరక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో బిజీగా కనిపించినవారిలో పద్మ జయంతి ఒకరు. తాజాగా 'ఫిల్మ్ ట్రీ' యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరియర్ గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంలోనే వేణుమాధవ్ గురించి ప్రస్తావించారు. 

"మా వారి స్నేహితుడికి వేణుమాధవ్ పరిచయం. ఆ ఫ్రెండ్ వలన మా వారికి వేణుమాధవ్ తో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అప్పటికి వేణుమాధవ్ ఇంకా ఆర్టిస్టుగా బిజీ కాలేదు .. ఆయనకి పెళ్లి కూడా కాలేదు. ఒకసారి ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోతే, మా ఇంటి నుంచి క్యారియర్ పంపించమని మా వారికి కాల్ చేశారు. అలా అప్పుడప్పుడు షూటింగ్స్ నుంచి కూడా ఆయన కాల్ చేయడం .. మా వారు క్యారియర్ తీసుకుని వెళుతుండటం జరిగేది. 

ఇలా వేణుమాధవ్ గారికి మా ఇంటి నుంచి క్యారియర్ వెళ్లడం, అంతా తప్పుగా అనుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది. నాకు కూడా ఏమైనా వేషాలు చెబుతాడేమోననే స్వార్థంతోనే నేను కూడా ఆలోచన చేశాను. అయితే ఆయన ద్వారా నాకు ఒక్క వేషం కూడా రాలేదు. అంతేకాదు .. ఏవో ప్రొబ్లెమ్స్ ఉన్నాయని చెప్పి నా దగ్గర నుంచి కొన్నిసార్లు డబ్బులు కూడా తీసుకున్నాడు .. ఆ డబ్బులు తిరిగివ్వలేదు కూడా" అంటూ చెప్పుకొచ్చారు.

Padma Jayanthi
Actress
Venu Madhav
Tollywood
  • Loading...

More Telugu News