Vijay Antony: విజయ్ ఆంటోని నెక్స్ట్ మూవీగా 'హత్య' .. రిలీజ్ డేట్ ఖరారు!

Hathya Movie Title Confirmed

  • 'బిచ్చగాడు 2'తో హిట్ కొట్టిన విజయ్ ఆంటోని 
  • నెక్స్ట్ సినిమాగా రూపొందిన 'హత్య'
  • కథానాయికలుగా రితిక - మీనాక్షి చౌదరి 
  • జులై 21వ తేదీన సినిమా విడుదల


విజయ్ ఆంటోని సినిమాలు భిన్నంగా ఉంటాయి .. ఆయన సినిమాల్లో బలమైన కంటెంట్ ఉంటుంది. ఆయన పాత్ర కూడా సహజత్వానికి దగ్గరగా కనిపిస్తుంది అనే అభిప్రాయాలు ఆడియన్స్ లో ఉన్నాయి. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'బిచ్చగాడు 2' భారీ వసూళ్లను రాబట్టింది. తమిళ వెర్షన్ తో సమానంగా తెలుగు వెర్షన్ లాభాలు తెచ్చిపెట్టింది. 

అలాంటి ఆయన నుంచి మరో సినిమా రావడానికి రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే 'హత్య'. కొంతసేపటి క్రితమే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జులై 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో విజయ్ ఆంటోని డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. 

'హత్య' అనే టైటిల్ ను బట్టే ఇది ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ అనే విషయం అర్థమవుతోంది. ఎవరు ఎవరిని ఎందుకోసం హత్య చేశారు? అనే అంశం చుట్టూ ఈ కథ తిరగనుంది. బాలాజీ కుమార్ దర్శకత్వంలో గిరీశ్ గోపాలకృష్ణన్ నిర్మించిన ఈ సినిమాలో, కథానాయికలుగా మీనాక్షి చౌదరి - రితిక అలరించనున్నారు.

Vijay Antony
Rithika
Meenakshi Chaudary
Hathya Movie
  • Loading...

More Telugu News