Saitej: 'విరూపాక్ష' దర్శకుడికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన మేకర్స్!

Virupaksha Director Tweet

  • సాయితేజ్ హీరోగా వచ్చిన 'విరూపాక్ష'
  • 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా 
  • సాయితేజ్ కి దక్కిన భారీ హిట్ 
  • బెంజ్ కారును గిఫ్ట్ గా అందుకున్న డైరెక్టర్


సాయితేజ్ చాలా గ్యాప్ తరువాత చేసిన సినిమా 'విరూపాక్ష'. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. కెరియర్ పరంగా ఆయనకి ఇది రెండో సినిమా. సుకుమార్ స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకుంది. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టిన కారణంగా, నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ .. హీరో సాయితేజ్ కలిసి ఆయనకి ఒక మెర్సిడెజ్ బెంజ్ కారును సుకుమార్ సమక్షంలో గిఫ్ట్ గా అందజేశారు. వాళ్లకి థ్యాంక్స్ చెబుతూ, అందుకు సంబంధించిన ఫొటోలను కార్తీక్ వర్మ దండు షేర్ చేశాడు. ప్రమాదం నుంచి కోలుకున్న సాయితేజ్ కి, ఈ సినిమా తనపై తనకి మళ్లీ నమ్మకాన్ని కలిగించింది. అందువలన దర్శకుడికి ఈ గిఫ్ట్ ను అందజేసే విషయంలో ఆయన కూడా ఉత్సాహాన్ని చూపించాడు. ఒక విలేజ్ నేపథ్యంలో .. ఎక్కువగా చిన్న ఆర్టిస్టులతో కూడిన సెటప్ తో ..  ఇంట్రెస్టింగ్ గా కథను నడిపించిన తీరే ఈ సినిమాకి ఎక్కువ లాభాలు రావడానికి కారణమైందనే సంగతి తెలిసిందే.   

Saitej
Sukumar
Karthik Varma Dandu
Virupaksha
  • Loading...

More Telugu News