orr: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇక 120 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు!

Hyderabad ORR speed limit increases to 120 km
  • ఓఆర్ఆర్ పై వాహనాల వేగ పరిమితిని పెంచుతున్నట్లు వెల్లడి
  • ఇప్పటి వరకు గంటకు 100 కిలో మీటర్లకు అనుమతి
  • ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్న హెచ్ఎండీఏ
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగ పరిమితిని పెంచుతున్నట్లు హెచ్ఎండీఏ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై గరిష్ఠంగా గంటకు 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉంది. దీనిని ఇప్పుడు 120 కిలో మీటర్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భద్రతాపరమైన అంశాలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అర్వింద్ కుమార్ వేగ పరిమితిపై ప్రకటన చేశారు.
orr
Hyderabad

More Telugu News