Nagashourya: కామెడీ టచ్ తో సాగే యాక్షన్ మూవీగా 'రంగబలి' .. ట్రైలర్ రిలీజ్!

Rangabali trailer released

  • నాగశౌర్య హీరోగా రూపొందిన 'రంగబలి ' 
  • కథానాయికగా యుక్తి తరేజా పరిచయం 
  • అంచనాలు పెంచుతూ వచ్చిన అప్ డేట్స్ 
  • జులై 7వ తేదీన సినిమా విడుదల

నాగశౌర్య కథానాయకుడిగా 'రంగబలి' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి 'యుక్తి తరేజా' కథానాయికగా పరిచయమవుతోంది. సీహెచ్ పవన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. 

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదులుతూ వచ్చిన పోస్టర్స్ వలన .. టీజర్ వలన మరింత ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ . యాక్షన్ .. కామెడీతో కూడిన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విలన్ గా షైన్ టామ్ చాకో మార్క్ చూపించారు.  

 శరత్ కుమార్ .. మురళీ శర్మ .. శుభలేఖ సుధాకర్ .. గోపరాజు రమణ .. సత్య .. అనంత శ్రీరామ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. జులై 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగశౌర్యకి ఈ సినిమా అయినా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.

More Telugu News