Lakshmi: అమెజాన్ ప్రైమ్ లో 'స్వీట్ కారం కాఫీ' వెబ్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..!

Sweet Karam Coffee Web Series Sreaming Date Confirmed
  • మూడు తరాల వ్యక్తుల జీవితసారమే 'స్వీట్ కారం కాఫీ'
  • 8 ఎపిసోడ్స్ గా అందించనున్న కథ  
  • ప్రధానమైన పాత్రలను పోషించిన లక్ష్మి .. మధుబాల .. శాంతి 
  • జులై 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్  
కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంతో కూడిన కథలకు తెరపై కాలం చెల్లిపోయిందని అనుకుంటున్న సమయంలో, ఇప్పుడు వాటికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కావాల్సినంత స్పేస్ దొరికింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడిచే కథలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతున్నారు. అందువల్లనే ఈ తరహా కంటెంట్ తో ఎక్కువ వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. 

అలా అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి మరో వెబ్ సిరీస్ వస్తోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'స్వీట్ .. కారం .. కాఫీ'. ఇవి ముగ్గురు వ్యక్తుల స్వభావాలకు .. వారి జీవితంలో అనుభవాలకు నిదర్శనం. ఆ ముగ్గురు వ్యక్తులు స్త్రీలే. వయసును బట్టి చూస్తే వారు మూడు తరాలకు ప్రతినిధులు. వారి జీవితంలోని కోణాలను వారి వైపు నుంచి ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వెబ్ సిరీస్. 

ఈ మూడు పాత్రలలో లక్ష్మి .. మధుబాల .. శాంతి కనిపించనున్నారు. బిజోయ్ నంబియార్ .. కృష్ణ మారిముత్తు .. స్వాతి రఘురామన్ దర్శకత్వం వహించారు. జులై 6వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ గా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇది రోడ్ జర్నీగా సాగే తమిళ వెబ్ సిరీస్. తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను అదే రోజు నుంచి అందుబాటులో ఉంచుతున్నారు.
Lakshmi
Madhubala
Shanthi
Sweet Karam Coffee

More Telugu News