Sanjay Raut: కేసీఆర్ కు ఓడిపోతాననే భయం పట్టుకుంది: సంజయ్ రౌత్

Sanjay Raut comments on KCR

  • ఓటమి భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారన్న సంజయ్ రౌత్
  • బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని వ్యాఖ్య
  • మహారాష్ట్రలో మహాకూటమి బలంగా ఉందన్న రౌత్

మహారాష్ట్రలో పాగా వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలో కూడా కావాలంటే... ఇక్కడ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. 

ఈ నేపథ్యంలో కేసీఆర్ పై శివసేన (ఉద్ధవ్ థాకరే) నేత సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఓడిపోతాననే భయం కేసీఆర్ కు పట్టుకుందని... అందుకే మహారాష్ట్రలో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డ్రామాలు ఆపాలని... లేకపోతే తెలంగాణలో ఓడిపోవడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి 12 నుంచి 13 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని అన్నారు. మహారాష్ట్రలో మహాకూటమి బలంగా ఉందని అన్నారు. 

Sanjay Raut
KCR
BRS
Maharashtra
  • Loading...

More Telugu News