Sanya Thakur: 'స్పై'తో పరిచయమవుతున్న మరో బంగారు బొమ్మ!

Spy Movie Update

  • తెలుగు తెరకి సన్యా ఠాకూర్ 
  • 'స్పై' సినిమాలో నిఖిల్ జోడీగా ఎంట్రీ 
  • ఈ పాన్ ఇండియా మూవీ పైనే ఆమె ఆశలు 
  • ఈ నెల 29వ తేదీన విడుదలవుతున్న సినిమా


టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో చాలామంది అందమైన భామలు పరిచయమయ్యారు. అయితే ఈ ఆరు నెలల్లో తెరపైకి వచ్చిన కొత్త కథానాయికలలో ఒకరిద్దరు మాత్రమే కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టారు. ఆ బ్యూటీలలో ఆషిక రంగనాథ్ .. అతుల్య రవి కనిపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో సుందరి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ సుందరి పేరే 'సన్యా ఠాకూర్'.

మొదటి నుంచి మోడలింగ్ వైపు ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చిన ఈ బ్యూటీ, 'సూపర్ 30' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్ లో బిజీగా ఉండే ఈ భామ, సోషల్ మీడియా ద్వారా చాలామంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. 'స్పై' సినిమాలో 'ఏజెంట్ సరస్వతి' పాత్రలో ఆమె కనిపించనుంది. రీసెంట్ గా ఆమెకి సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. సన్యా ఠాకూర్ మంచి ఫిట్ నెస్ తో గ్లామరస్ గా కనిపిస్తోంది. 'స్పై' పాన్ ఇండియా సినిమా కావడం వలన, ఈ సినిమా హిట్ అయితే తనకి మిగతా భాషల నుంచి మంచి ఆఫర్లు వస్తాయనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Sanya Thakur
Nikhil
Spy Movie
  • Loading...

More Telugu News