Raj Nath Singh: జమ్మూ కశ్మీర్, పీవోకేపై రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

PoK is was and will remain part of India Rajnath Singh

  • జమ్మూ కశ్మీర్‌పై పాక్ కు ఎలాంటి అధికారం లేదన్న కేంద్రమంత్రి
  • పీవోకేను భారత్ లో కలపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారని వెల్లడి
  • భారత పార్లమెంటులో పీవోకేపై తీర్మానం

జమ్మూ కశ్మీర్‌పై పాకిస్థాన్‌కు ఎలాంటి అధికారం లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం స్పష్టం చేశారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని భారత్‌లో కలపాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని ఆయన అన్నారు. జాతీయ భద్రతా సదస్సులో ఆయన మాట్లాడారు. పీఓకే భారత్‌లో భాగమేనని, అది అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.  

పీఓకే భారతదేశంలో అంతర్భాగమని భారత పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించబడిందని, జమ్మూ కశ్మీర్‌లో ఎక్కువ భాగం పాకిస్థాన్ ఆక్రమితంలో ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ లో ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే, పీవోకేలో ప్రజలు ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారన్నారు. వారు భారత్ తో ఉండాలనే డిమాండ్ చేస్తున్నారన్నారు.

Raj Nath Singh
Jammu And Kashmir
Pakistan
  • Loading...

More Telugu News