titanic: టైటాన్ జలాంతర్గామి... భర్త, కొడుకుతో మాట్లాడిన చివరి మాటలను గుర్తు చేసుకున్న క్రిస్టీన్

Pak billionaire wife about final talk with husband and son

  • కొడుకు చివరి మాటలు తలుచుకొని దావూద్ భార్య క్రిస్టీన్ కన్నీరుమున్నీరు
  • 96 గంటలు దాటాక ఆశలు వదిలేసుకున్నానని వెల్లడి
  • జలాంతర్గామి శకలాలు కనిపించాయని చెప్పే వరకు తన కూతురు నమ్మలేదన్న క్రిస్టీన్

టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లి టైటాన్ జలాంతర్గామి ముక్కలవడంతో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో పాకిస్థాన్ కు చెందిన వ్యాపారవేత్త షహజాదా దావూద్, అతని కొడుకు సులేమన్ ఉన్నారు. దావూద్ తన కొడుకుతో మాట్లాడిన చివరి మాటలు తలచుకొని కన్నీరుమున్నీరయ్యారు భార్య క్రిస్టిన్.

వారు తమ సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని వస్తారని టైటాన్ జలాంతర్గామి అనుబంధ పడవ పోలార్ ప్రిన్స్ పై క్రిస్టీన్, కూతురు ఎదురుచూస్తూ ఉన్నారు. జలాంతర్గామి తప్పిపోయిందనగానే ఆమె ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే గతంలో విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నాడనే ధైర్యం ఉంది. కానీ కీలకమైన 96 గంటలు దాటినప్పటికీ జలాంతర్గామి దొరకకపోవడంతో ఆశలు వదులుకున్నట్లు క్రిస్టీన్ చెప్పారు.

చివరిసారి తన భర్త, తనయుడితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకున్నారు. టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్తున్నానని సులేమన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడని, తనతో పాటు రూబిక్ క్యూబ్ ను తీసుకొని వెళ్లి సముద్రగర్భంలో రూబిక్ క్యూబ్ అమర్చిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పాలని భావించాడని చెప్పారు. అందుకు దరఖాస్తు కూడా చేశాడన్నారు.

ఈ సన్నివేశాన్ని రికార్డ్ చేయాలని తన భర్త తన వెంట కెమెరాను తీసుకు వెళ్లాడన్నారు. 96 గంటలు పూర్తయ్యేసరికి తాను ఆశలు వదిలేసుకున్నానని, తన కూతురు మాత్రం తిరిగి వస్తారనే నమ్మకంతో ఉందని, కానీ జలాంతర్గామి శకలాలు కనిపించాయని తీరప్రాంత రక్షక దళాలు చెప్పాక తన కూతురు కూడా చనిపోయిందని నమ్మిందన్నారు.

  • Loading...

More Telugu News