Nithin: పోలీస్ పాత్రలో కనిపించనున్న నితిన్!

Nithin and Vakkantham movie update

  • వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ 
  • సొంత బ్యానర్లో చేస్తున్న సినిమా ఇది 
  • కథానాయికగా కనిపించనున్న శ్రీలీల
  • సంగీతాన్ని అందిస్తున్న హారీస్ జయరాజ్

నితిన్ హీరోగా ఇప్పుడు రెండు సినిమాలు షూటింగు దశలో ఉన్నాయి. ఒకటి వెంకీ కుడుముల దర్శకత్వంలో .. మరొకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో. ఒకదాని తరువాత ఒకటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఈ సినిమాల నిర్మాణం కొనసాగుతోంది. వెంకీ కుడుముల సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. 

ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నితిన్ సినిమాలకి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టుగా కనిపిస్తాడట. అలా యాక్టింగులో భాగంగా ఆయన పోలీస్ యూనిఫామ్ ధరిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అది ఎలాంటి మలుపులకు కారణమవుతుంది? అనేదే కథ అంటున్నారు. ఈ అంశం చుట్టూనే కథ తిరుగుతుందని చెబుతున్నారు. 

నికిత రెడ్డి - సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి, 'జూనియర్' అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎగస్ట్రా ఆర్డినరీమేన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని అంటున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మొత్తానికి నితిన్ పోలీస్ గా కనిపించనున్నాడన్న మాట.

Nithin
Vakkantham Vamsi
Sreeleela
  • Loading...

More Telugu News