Congress: తెలంగాణలో కాంగ్రెస్ లో చేరుతున్న 35 మందితో జాబితా విడుదల చేసిన ఏఐసీసీ

AICC releases 35 joiners list of Telangana

  • 35 మందితో కూడిన జాబితా రాహుల్ కు అందజేత
  • జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావు
  • 15వ పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ లో చేరబోతున్న 35 మంది నేతలతో కూడిన లిస్ట్ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చేరింది. ఈ జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుది కాగా... పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు 15వ స్థానంలో ఉంది. మరోవైపు రాహుల్, ఖర్గేలతో పొంగులేటి, జూపల్లి భేటీ ముగిసింది.

Congress
Telangana
Joiners
Rahul Gandhi
AICC
  • Loading...

More Telugu News