Harshith Reddy: ఈ వారం ఓటీటీలో రానున్న వెబ్ సిరీస్ లు ఇవే!

OTT Movies Update

  • ఈ వారం సందడిగానే కనిపిస్తున్న ఓటీటీ సెంటర్స్ 
  • తెలుగు వెబ్ సిరీస్ గా 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్'
  • కామెడీ నేపథ్యంలో సాగే డ్రామా 
  • ఈ నెల 30 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్   

భారీ బడ్జెట్ విషయంలో .. బలమైన కంటెంట్ విషయంలో వెబ్ సిరీస్ లు పోటీపడుతున్నాయి. స్టార్ హీరోలు ... హీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తిని చూపిస్తుండటానికి కారణం ఇదే. వెబ్ సిరీస్ ల కారణంగా వివిధ భాషలకి .. ప్రాంతాలకి చెందిన ప్రజల నుంచి ఎక్కువ గుర్తింపు లభిస్తుండటం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ వారం కూడా ఓటీటీ సెంటర్స్ లో వెబ్ సిరీస్ ల సందడి ఎక్కువగానే కనిపిస్తోంది. 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో ఈ నెల 28వ తేదీన 'వీకెండ్ ఫ్యామిలీ' .. 30వ తేదీన 'ది నైట్ మేనేజర్' (సిరీస్ 2) స్ట్రీమింగ్ కానున్నాయి.  'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 29వ తేదీన 'లస్ట్ స్టోరీస్ 2' .. 30వ తేదీన 'సెలబ్రెటీ' (కొరియన్ సిరీస్) స్ట్రీమింగుకు రెడీ అవుతున్నాయి. 

ఈ నెల 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో 'జాక్ ర్యాన్' (సిరీస్ 4) .. జియో సినిమాలో 'సార్జెంట్' .. ఆహాలో 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. హర్షిత్ రెడ్డి .. తేజస్వి  .. అనన్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, కార్పొరేట్ ఆఫీసులో జాబ్స్ .. అక్కడి టెన్షన్స్ నేపథ్యంలో కామెడీ టచ్ తో కొనసాగుతుంది.

Harshith Reddy
Tejaswi
Ananya
Arthamayyinda Arun Kumar
  • Loading...

More Telugu News