Surekhavani: నిర్మాత కేపీ చౌదరితో లింకులు అంటూ ప్రచారం... నటి సురేఖావాణి స్పందన

Surekhavani reacts on allegations

  • డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్
  • కస్టడీలో వెల్లడైన అంశాలతో టాలీవుడ్ లో కలకలం
  • తెరపైకి ఆషూ రెడ్డి, జ్యోతి, సురేఖావాణి పేర్లు
  • తనకెలాంటి సంబంధం లేదన్న సురేఖావాణి
  • దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి

డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో వెల్లడైన అంశాలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. బిగ్ బాస్ ఫేమ్ ఆషూ రెడ్డి, నటి జ్యోతి, నటి సురేఖవాణిల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీనిపై సురేఖవాణి ఓ వీడియో ద్వారా స్పందించారు. 

గత కొంతకాలంగా తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం చేశారు. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దయచేసి తమపై ఆరోపణలు చేయడం ఆపేయండి అని సురేఖావాణి పేర్కొన్నారు. 

"మీరు చేస్తున్న ఆరోపణల వల్ల మా కెరీర్, మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబం, మా ఆరోగ్యం... అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. దయ ఉంచి ఇలాంటి ప్రచారాలు చేయవద్దు. మమ్మల్ని అర్థం చేసుకోండి... ప్లీజ్!" అంటూ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.

Surekhavani
KP Chowdary
Drugs
Tollywood
  • Loading...

More Telugu News