Bandla Ganesh: అన్నా వస్తున్నా.. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా: బండ్ల గణేశ్

bandla ganesh tweet on bhatti vikramarka padayatra

  • పాలిటిక్స్‌లోకి తిరిగి వస్తున్నానంటూ ఇటీవల ప్రకటించిన బండ్ల గణేశ్
  • భట్టి విక్రమార్క ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రలో పాల్గొననున్నట్లు వెల్లడి
  • సూర్యాపేటకు వస్తున్నానంటూ ట్వీట్

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తాను పాలిటిక్స్‌లోకి తిరిగి వస్తున్నానంటూ ఇటీవల ప్రకటన చేసిన ఆయన.. తాజాగా ‘అన్నా వస్తున్నా’ అంటూ మరో ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రలో పాల్గొననున్నట్లు చెప్పారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

‘‘అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నా జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్’’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో బండ్ల గణేశ్‌ చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ టికెట్ దక్కలేదు. పైగా  పార్టీ ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Bandla Ganesh
Mallu Bhatti Vikramarka
Congress
Telangana
peoples march

More Telugu News