Ravi Shastri: రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యలపై రవిశాస్త్రి స్పందన

Ravi Shastri response on Ashwin comments on dressing room

  • ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో స్నేహితులు లేరన్న అశ్విన్
  • ఎవరికైనా నలుగురైదుగురి కంటే ఎక్కువ మంది స్నేహితులు ఉండరన్న రవిశాస్త్రి
  • తాను ఐదుగురు సన్నిహితులతో సంతోషంగా ఉన్నానని వ్యాఖ్య

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఇప్పుడు స్నేహితులు అనేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఎక్కువ మంది సహోద్యోగులేనని రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అశ్విన్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ... ఎవరికైనా ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారని ప్రశ్నించారు. 

ఎవరిని అడిగినా ఒక నలుగురు లేదా ఐదుగురు అని చెపుతారని... తన జీవితంలో తాను ఐదుగురు సన్నిహితులతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఇంతకు మించి ఎక్కువ మంది కూడా తనకు అవసరం లేదని అన్నారు. అందరూ కొలీగ్స్ మాత్రమేనని.. కామెంట్రీ బాక్స్ లో కూడా కొలీగ్సేనని చెప్పారు.

Ravi Shastri
Ravichandran Ashwin
Team India
  • Loading...

More Telugu News