Upasana: మా చిన్ని తల్లికి లభిస్తున్న స్వాగతం ముగ్ధుల్ని చేసింది: ఉపాసన

Upasana said they overwhelmed with love and blessings upon their little one

  • జూన్ 20న బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
  • తొలిసారి తల్లిదండ్రులయిన ఉపాసన, రామ్ చరణ్
  • ఇటీవలే అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఉపాసన
  • తమ బిడ్డపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ థ్యాంక్స్ అంటూ ఉపాసన పోస్టు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి తండ్రయిన ఆనందాన్ని అనుభవిస్తుండగా, మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. జూన్ 20న ఉపాసన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో పండంటి అమ్మాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 

రామ్ చరణ్, ఉపాసన 2012లో పెళ్లితో ఒక్కటి కాగా, ఇన్నాళ్లకు మెగా ఇంట మూడో తరం అడుగుపెట్టింది. దాంతో చిరంజీవి కుటుంబ సభ్యుల్లోనూ, మెగా అభిమానుల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

దీనిపై ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ చిన్ని తల్లికి లభిస్తున్న ఘన స్వాగతం తమను ముగ్ధుల్ని చేస్తోందని తెలిపారు. తమపైనా, తమ చిన్నారిపైనా ప్రేమ, ఆశీస్సులు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఉపాసన పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా తమ నివాసంలో కుమార్తెను పొదివిపట్టుకుని ఉన్న ఫొటోను కూడా ఉపాసన పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్ తమ పూడిల్ జాతి పెంపుడుకుక్కను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తుండడం చూడొచ్చు.

More Telugu News