Nithin: నితిన్ దగ్గరికి చేరిన బన్నీ కథ!

Nithin in Venu Sri Ram Movie

  • నితిన్ చేతిలో రెండు సినిమాలు
  • రెండు పెద్ద ప్రాజెక్టులే కావడం విశేషం  
  • వేణు శ్రీరామ్ 'ఐకాన్' కథకి కూడా ఓకే
  • వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్

అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ 'ఐకాన్' కథను రెడీ చేశాడు. ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజు ముందుకొచ్చాడు. అయితే ముందుగా ఈ సినిమాను చేయాలనుకున్న బన్నీ, ఆ తరువాత మనసు మార్చుకున్నాడు. ఈ కథ పాన్ ఇండియా స్థాయిలో లేకపోవడమే అందుకు కారణమనే ఒక టాక్ వినిపించింది. ఇప్పుడు అదే కథకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. 

నితిన్ ఈ మధ్య కాలంలో సక్సెస్ ను అందుకుని చాలా కాలమే అయింది. దాంతో సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే ఒక పట్టుదలతో ఆయన ఉన్నాడు. అందులో భాగంగానే 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుములతోను .. వక్కంతం వంశీతోను సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే వేణు శ్రీరామ్ కథను వినిపించడం .. నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న రెండు సినిమాలు పూర్తికాగానే, వేణు శ్రీరామ్ సినిమా మొదలవుతుందని అంటున్నారు. కథానాయికలుగా ఆషిక రంగనాథ్ .. అనుపమ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. 

Nithin
Vakkantham
Venky Kudumula
Venu Sri Ram
  • Loading...

More Telugu News