Nikhil: డ్రగ్స్ తీసుకోవాలని నాకు చాలాసార్లు ఆఫర్ చేశారు: హీరో నిఖిల్

Nikhil opines on drugs

  • టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం
  • నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో పలు అంశాల వెల్లడి
  • ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న హీరో నిఖిల్
  • డ్రగ్స్ కు అందరూ దూరంగా ఉండాలని పిలుపు
  • తానెప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదని వెల్లడి

డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో వెల్లడించిన అంశాలతో టాలీవుడ్ లో మరోసారి కలకలం రేగింది. కాగా, ఓ అవగాహన కార్యక్రమంలో హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

డ్రగ్స్ తీసుకోవాలంటూ గతంలో తనకు చాలాసార్లు ఆఫర్ చేశారని నిఖిల్ వెల్లడించారు. కానీ తాను ఎప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ కు అందరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలంగాణ, భారతదేశం మాదకద్రవ్యాల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

యువత డ్రగ్స్ జోలికి వెళ్లకుండా స్నేహితులతో కలిసి ఇతర మార్గాల్లో జీవితాన్ని ఆస్వాదించడంపై దృష్టి సారించాలని నిఖిల్ సూచించారు. ప్రయాణాలు చేయండి, విహారయాత్రలకు వెళ్లండి, సైక్లింగ్ చేయండి... ఫుట్ బాల్, క్రికెట్ వంటి ఆటలు ఆడండి, సినిమాలు చూడండి... అంతేతప్ప మత్తుకు బానిసలు కావొద్దు అని సలహా ఇచ్చారు.

Nikhil
Drugs
Tollywood
KP Chowdary
  • Loading...

More Telugu News