Vyuham: రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం'లో వైఎస్ భారతి, విజయమ్మ పాత్రలు పోషించింది వీరే!

YS Bharathi and YS Vijayamma characters in Vyuham

  • 'వ్యూహం' టీజర్ విడుదల
  • భారతి పాత్రను పోషించిన మలయాళ నటి మానస
  • విజయమ్మ పాత్రలో సురభి ప్రభావతి

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రయాణం కథాంశంతో రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం', 'శపథం' చిత్రాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా 'వ్యూహం' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. పావురాలగుట్టలో రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడంతో టీజర్ ప్రారంభమవుతుంది. 'అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు' అని జగన్ చెప్పే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. 

2.46 నిమిషాల నిడివి ఉన్న టీజర్ లో ఈ ఒక్క డైలాగ్ మాత్రమే ఉంది. ట్రైలర్ లో వైఎస్ భారతి పాత్రను పోషించిన నటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు వర్ధమాన మలయాళ నటి మానస రాధాకృష్ణన్. ఆమె ఇప్పటికే తెలుగులో ఒక సినిమా చేసింది. ఆనంద్ దేవరకొండ చిత్రం 'హైవే'లో మూవీలో మానస నటించింది. విజయమ్మ పాత్రలో సురభి ప్రభావతి నటించారు.

Vyuham
YS Bharathi
YS Vijayamma
Ram Gopal Varma
Tollywood

More Telugu News