Purnananda Swamy: బాలికపై పూర్ణానందస్వామి లైంగిక వేధింపులు వాస్తవమే.. రిమాండ్ రిపోర్టులో పోలీసులు

Police Files Remand Report On Visakha Purnananda Swamy

  • మరో బాలికపైనా పూర్ణానంద అత్యాచారం
  • గర్భం దాల్చడంతో ఇంటికి తీసుకెళ్లిన బంధువులు
  • ఈ నెల 20న స్థానికంగా విచారణ చేపట్టిన పోలీసులు

పదిహేనేళ్ల బాలికపై రెండేళ్లపాటు అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానందస్వామిపై పోలీసులు రిమాండ్ రిపోర్టు సిద్ధం చేశారు. బాలికపై లైంగిక వేధింపులు నిజమేనని అందులో పేర్కొన్నారు. పూర్ణానందస్వామి ప్రస్తుతం జైలులో ఉండగా, దిశ పోలీసు విభాగం డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో ఈ నెల 20న స్థానికంగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బాలిక ఆరోపణలు నిజమేనని తేలింది. అదే విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

గర్భం దాల్చిన  మరో బాలిక
ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాధిత బాలికను పూర్ణానందస్వామి అర్ధరాత్రి వేళ నిద్రలేపి తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవారు. మరో బాలికతోనూ ఆయన ఇలాగే ప్రవర్తించడంతో ఆమె గర్భం దాల్చింది. విషయం తెలిసిన బంధువులు బాలికను ఆశ్రమం నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే, ఈ విషయం వెలుగులోకి రాలేదు. స్వామి అత్యాచారాలు భరించలేని బాలిక ఆశ్రమం నుంచి తప్పించుకోవడంతో ఆయన లీలలు ఇప్పుడు బయటకొచ్చాయి. ఇద్దరు బాలికలపై పూర్ణానందస్వామి అత్యాచారానికి పాల్పడినట్టు ప్రాథమికంగా ఆధారాలు లభించినట్టు డీఎస్పీ వివేకానంద తన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Purnananda Swamy
Visakhapatnam
Police
Disha Police
  • Loading...

More Telugu News