Kanna Lakshminarayana: జగన్‌ను ఆయన తల్లి, చెల్లెలే నమ్మడం లేదు.. రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి?: కన్నా లక్ష్మీనారాయణ

kanna lakshminarayana fires on jagan

  • వ్యవస్థలను జగన్ నాశనం చేస్తూ.. అరాచక పాలన సాగిస్తున్నారన్న జగన్
  • ఎంతో మంది పేదవాళ్లను చంపిన హంతకుడంటూ తీవ్ర ఆరోపణలు
  • దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలనేదే జగన్ లక్ష్యమని వ్యాఖ్య

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జగన్‌ను ఆయన తల్లి, చెల్లెలే నమ్మడం లేదని.. రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. శుక్రవారం బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో టీడీపీ చేపట్టిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా రచ్చబండ నిర్వహించారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. వ్యవస్థలను సీఎం జగన్ నాశనం చేస్తూ.. అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ‘‘దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలనేదే జగన్ లక్ష్యం. అందుకోసం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తన ప్రణాళికను అమల్లో పెట్టారు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తోంది’’ అని అన్నారు. 

‘‘ఎంతో మంది పేదవాళ్లను చంపిన హంతకుడు జగన్. ‘నన్ను నమ్మండి’ అని జగన్ అంటున్నారు. నిన్ను నీ తల్లి నమ్మట్లేదు.. నీ చెల్లి నమ్మట్లేదు.. నీ బాబాయ్ ని హత్య చేయించిన పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రంలో నిన్ను ఎవరు నమ్ముతారు జగన్?’’ అని కన్నా లక్ష్మీనారాయణ నిలదీశారు.

Kanna Lakshminarayana
Jagan
TDP
bhavishyathu guarantee
YSRCP
  • Loading...

More Telugu News