Nikhil: ఉత్కంఠను రేకెత్తిస్తున్న 'స్పై' .. ట్రైలర్ రిలీజ్!

Spy trailer released

  • నిఖిల్ హీరోగా రూపొందిన 'స్పై'
  • స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • కథానాయికగా మెరవనున్న ఐశ్వర్య మీనన్
  • ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్  
  • ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల

నిఖిల్ వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'స్పై' రూపొందింది. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాద్ .. అమీర్ పేటలోని AAA సినిమాస్ లో నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ .. ఛేజింగ్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ట్రైలర్ చివర్లో రానా మెరవడం విశేషం. 

నిఖిల్ జోడీగా ఐశ్వర్య మీనన్ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో సన్యా ఠాకూర్ ..  ఆర్యన్ రాజేశ్ .. జిషు సేన్ గుప్తా .. మకరంద్ దేశ్ పాండే .. అభినవ్ గౌతమ్ కనిపించనున్నారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణం .. దాని వెనుక గల రహస్యం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. నిఖిల్ ఫెస్టి టైమ్ చేస్తున్న భారీ యాక్షన్ మూవీగా దీనిని గురించి చెప్పుకోవచ్చు.

Nikhil
Aishvarya Menon
Rana
Spy Movie

More Telugu News