Prabhas: 'ఆదిపురుష్' విషయంలో అలా చేద్దామంటే ప్రభాస్ ఒప్పుకోలేదట!

Adi Purush movie Update

  • 3 గంటల నిడివి కలిగిన 'ఆదిపురుష్'
  • రెండు భాగాలుగా చేద్దామన్న దర్శకుడు 
  • అలా చేయడం కరెక్టు కాదన్న ప్రభాస్ 
  • ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తున్న ఆడియన్స్   

ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'ఆదిపురుష్' ఈ నెల 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ అంచనాల మధ్య  .. భారీ ఓపెవింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. టి. సిరీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 410 కోట్లను వసూలు చేసింది.

3 గంటల నిడివితో ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకుని వచ్చారు. 'రామాయణం' మొత్తాన్ని ఒకే పార్టులో చెప్పడం కష్టమవుతుందనీ, అందువలన రెండు భాగాలుగా ఉండేలా చేద్దామని ప్రభాస్ తో ఓం రౌత్ చెప్పాడట. అయితే అందుకు ప్రభాస్ నిరాకరించినట్టుగా సమాచారం. 

'రామాయణం' గురించి దాదాపు అందరికీ తెలుసనీ, అందరికీ తెలిసిన కథను రెండో భాగంగా ప్లాన్ చేయడంలో అర్థం లేదని ప్రభాస్ అన్నాడట. ఆల్రెడీ తాను కమిటైన ప్రాజెక్టులు ఈ సినిమా వలన మరింత ఆలస్యం అవుతాయనీ, అలా చేయడం కరెక్టు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని అంటున్నారు. ప్రభాస్ అలా చెప్పడమే మంచిదైందని ఇప్పుడు ఈ సినిమా చూసినవారు అంటున్నారు. 

Prabhas
krithi Sanon
Om Raut
Adipurush Movie
  • Loading...

More Telugu News