Lust Stories 2: బోల్డ్ కంటెంట్‌తో లస్ట్ స్టోరీస్2.. ట్రైలర్ వచ్చేసింది

Lust Stories 2 Official Trailer released

  • 2018లో సంచలనం రేపిన లస్ట్ స్టోరీస్ సిరీస్
  • దానికి కొనసాగింపుగా వస్తున్న తాజా సిరీస్
  • కీలక పాత్రల్లో నటించిన తమన్నా, కాజోల్, మృణాల్

టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఓవైపు సౌత్ లో నటిస్తూనే హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇటీవలే ‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథకు అవసరం కావడంతో శృంగార, ముద్దు సన్నివేశాల్లో నటించానని ఈ సిరీస్ విడుదల సందర్భంగా చెప్పిందామె. ఆమె కీలక పాత్రలో నటించిన మరో వెబ్ సిరీస్‌ ‘లస్ట్ స్టోరీస్‌ 2’ విడుదలకు సిద్ధమైంది. 2018లో వచ్చి సంచలనం రేపిన ‘లస్ట్ స్టోరీస్‌’ ప్రాంచైజీలో వస్తున్న రెండో సిరీస్‌ ఇది.

తాజాగా ట్రైలర్‌‌ను విడుదల చేశారు. తమన్నాతో పాటు కాజోల్, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ తదితరులు ఇందులో నటించారు. జీ కర్దా మాదిరిగా ఇందులోనూ తమన్నా రొమాంటిక్ సీన్స్‌లో నటించింది. లస్ట్ స్టోరీస్ 1 తరహాలోనే బోల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఈ వెబ్ సిరీస్‌ ఉండబోతోందని ట్రైలర్‌‌ను చూస్తే తెలుస్తోంది. నిజ జీవితంలో ప్రేమలో ఉన్న విజయ్ వర్మ, తమన్నా  ఇందులో జంటగా నటించడం ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

Lust Stories 2
Tamannaah
Trailer
kajol

More Telugu News