Mahesh Babu: 'గుంటూరు కారం'లో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్?

Gunturu Karam Movie Update

  • మహేశ్ బాబు హీరోగా 'గుంటూరు కారం'
  • డేట్స్ సర్దుబాటు కాలేదన్న పూజ హెగ్డే 
  • రెండో కథానాయికగా తెరపైకి సాక్షి వైద్య పేరు
  • జనవరి 13వ తేదీన సినిమా విడుదల

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమా రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్దేను అనుకున్నారు. రెండో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు. అయితే పూజ హెగ్డే ఇచ్చిన డేట్స్ వాడుకోకపోవడం వలన, ఇక ఇప్పుడు ఆమె డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదట. 

దాంతో ఈ సినిమా టీమ్ ప్రధానమైన కథానాయికగా శ్రీలీలను సెట్ చేసి, రెండో కథానాయికగా సాక్షి వైద్యను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం పూజ హెగ్డేకి అడ్వాన్స్ గా 70 లక్షల వరకూ ఇచ్చారట. ఆ మొత్తం క్రింద ఒక స్పెషల్ సాంగ్ చేసిపెట్టమని ఆమెను అడుగుతున్నారని సమాచారం. 

ఇటు త్రివిక్రమ్ తోను .. అటు మహేశ్ తోను పూజ హెగ్డేకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఆమె కాదనే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే కథానాయికల మార్పిడి విషయంలో క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావలసిందే. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రానుంది.  

More Telugu News