Pavan Kalyan: ప్రభాస్ .. మహేశ్ నాకంటే పెద్ద హీరోలు : పవన్ కల్యాణ్

Pavan Kalyan Varahi Yathra News

  • వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ 
  • ఇతర హీరోల గురించిన ప్రస్తావన 
  • తనకి ఎలాంటి ఇగో లేదని వెల్లడి 
  • హీరోలందరి అభిమానులు కలిసి రావాలని పిలుపు  

పవన్ కల్యాణ్ ఒక వైపున వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున రాజకీయాలలో తీరిక లేకుండా ఉన్నారు. తన పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రాలో ఆయన 'వారాహి యాత్ర' కొనసాగుతోంది. నిన్న సాయంత్రం ఆయన చేసిన ప్రసంగం టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులందరినీ ఆకట్టుకుంది. 

పవన్ మాట్లాడుతూ .. "ప్రభాస్ నాకంటే పెద్ద హీరో .. పాన్ ఇండియా స్టార్. అలాగే మహేశ్ బాబు కూడా నాకంటే పెద్ద హీరో. పారితోషికం కూడా వారు నాకంటే ఎక్కువగానే తీసుకుంటారు. అలాగే చిరంజీవిగారు .. బాలకృష్ణ గారు .. అల్లు అర్జున్ గారు .. రామ్ చరణ్ గారు. వీళ్లంతా ప్రపంచవ్యాప్తంగా తెలుసు .. నేను తెలియదు" అన్నారు. 

" ఈ హీరోలందరి సినిమాలు నేను చూస్తాను .. వాళ్లందరినీ ఇష్టపడతాను. నాకు ఎలాంటి ఇగో ఫీలింగ్స్ లేవు. సినిమా హీరోల పట్ల మీకున్న అభిమానాన్ని రాజకీయాల్లోకి తీసుకుని రాకండి. రైతు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. రైతు సమస్యలు పరిష్కరించడానికి అందరి హీరోల అభిమానులు నాకు అండగా ఉండాలి" అంటూ కోరారు. ఇప్పుడు ఈ మాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. 

Pavan Kalyan
Varahi Yathra
  • Loading...

More Telugu News