Narendra Modi: అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

Indian Prime Minister Modi meets Joe biden jill biden

  • వైట్‌హౌస్‌లో ప్రధానికి బైడెన్ దంపతుల సాదర స్వాగతం
  • ద్వైపాక్షిక అంశాలపై బైడెన్, మోదీ చర్చలు
  • రేపు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఏర్పాటు చేసే విందులో పాల్గొననున్న ప్రధాని

ప్రస్తుతం అగ్రరాజ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. వైట్‌ హౌస్‌లో ప్రధానికి బైడెన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత ఇరు నేతలూ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం బైడెన్ మోదీకి పురాతన అమెరికన్ బుక్ గ్యాలీతో పాటూ పాతకాలపు అమెరికన్ కెమెరాను కూడా ఇవ్వనున్నారు. కాగా, ప్రధానికి బైడెన్ దంపతులు అధికారిక విందు కూడా ఇవ్వనున్నారు. 

ఇక శుక్రవారం ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆమె భర్త ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. నేడు అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ ఆ తరువాత నోబెల్ విజేత, ఆర్థికవేత్త పాల్ రోమన్‌తో భేటీ అవుతారు.

Narendra Modi
USA
Joe Biden
  • Loading...

More Telugu News