Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

Rainfall in Hyderabad

  • నగరవాసులను పలకరించిన వరుణుడు
  • పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం
  • అకస్మాత్తుగా వర్షం పడటంతో తడిసి ముద్దయిన జనం

భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేకపోతున్న హైదరాబాద్ వాసులను వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. చాలా రోజుల తరువాత నగరంలో నేటి సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, అమీర్‌పేట, సికింద్రాబాద్, పరేడ్ మైదాన్, పాతబస్తీ బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, కాలాపత్తర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌ నగర్, సంతోష్ నగర్, కోఠీ, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అకస్మాత్తుగా వాన పడటంతో అనేక మంది తడిసిముద్దయ్యారు. వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కూడా ఏర్పడింది.

Hyderabad
Telangana
Monsoon
  • Loading...

More Telugu News