Sensex: హిస్టరీ క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్లు... లైఫ్ టైమ్ హైని తాకిన సెన్సెక్స్
- 195 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 1.59 శాతం పతనమైన ఎం అండ్ ఎం షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు చరిత్రను సృష్టించాయి. సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 63,523కి చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 18,857 వద్ద స్థిరపడింది. 2022 డిసెంబర్ 1న సెన్సెక్స్ 63,583 పాయింట్లను నమోదు చేసింది. ఈనాటి మార్నింగ్ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 63,588 పాయింట్లను టచ్ చేసింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్లలో జోష్ ను నింపాయి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.68%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.71%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.66%), టెక్ మహీంద్రా (1.13%), టీసీఎస్ (0.94%).
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.59%), ఐటీసీ (-1.29%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.87%), యాక్సిస్ బ్యాంక్ (-0.83%), బజాజ్ ఫైనాన్స్ (-0.62%).