India: ఇండియాలోని టాప్ 10 కంపెనీలు ఏమిటో, వాటి విలువ ఎంతో తెలుసా?

List of Indias most valuable companies

  • టాప్ 500 ప్రైవేట్ కంపెనీల జాబితాను విడుదల చేసిన యాక్సిస్ బ్యాంక్, హురూన్ ఇండియా
  • రూ. 17 లక్షల కోట్లకు పైగా విలువతో రిలయన్స్ టాప్
  • రెండు, మూడు స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్

మన దేశంలోని అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాను యాక్సిస్ బ్యాంక్, హురూన్ ఇండియాలు విడుదల చేశాయి. 2022 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ జాబితాను తయారు చేశారు. అయితే ఈ జాబితాలో కేవలం ప్రైవేట్ సంస్థలను మాత్రమే తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలకు చోటు కల్పించలేదు. 

దేశంలోని అత్యంత విలువైన 10 కంపెనీలు:
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ - విలువ రూ. 17,25,058 కోట్లు
  • టీసీఎస్ - రూ. 11,68,390 కోట్లు
  • హెచ్డీఎఫ్సీ బ్యాంక్ - రూ. 8,33,656 కోట్లు
  • ఇన్ఫోసిస్ - రూ. 6,46,985 కోట్లు
  • ఐసీఐసీఐ బ్యాంక్ - 6,33,171 కోట్లు
  • భారతి ఎయిర్ టెల్ - రూ. 4,89,575 కోట్లు
  • హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ - రూ. 4,48,844 కోట్లు
  • ఐటీసీ - రూ. 4,32,359 కోట్లు
  • అదానీ గ్యాస్ - రూ. 3,96,245 కోట్లు
  • అదానీ ఎంటర్ ప్రైజెస్ - రూ. 3,81,610 కోట్లు.

  • Loading...

More Telugu News