Prabhas: ఐదో రోజు వసూళ్లతో 395 కోట్లకి చేరుకున్న 'ఆదిపురుష్'

Adi Purush movie Update

  • తొలి రోజున 140 కోట్ల గ్రాస్ 
  • రెండో రోజుతో 240 కోట్లు 
  • మూడోరోజుతో 340 కోట్ల వసూళ్లు 
  • నాలుగో రోజుతో 375 కోట్లు 
  • ఐదో రోజుతో 395 కోట్లు రాబట్టిన సినిమా

భారీ అంచనాల మధ్య ఈ నెల 16వ తేదీన 'ఆదిపురుష్' విడుదలైంది. చాలా గ్యాప్ తరువాత రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. తొలి రోజునే ఈ సినిమా 140 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండోరోజున 240 కోట్లకు .. మూడో రోజున 340 కోట్లకు వసూళ్లు చేరుకున్నాయి. 

అయితే 4వ రోజు నుంచి వసూళ్లలో తగ్గుదల కనిపిస్తూ వస్తోంది. 4వ రోజుతో కలుపుకుని 375 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా, 5 రోజుతో 395 కోట్లకు చేరుకుంది. 6వ రోజుతో ఈ సినిమా 400 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయమనే చెప్పాలి. ఇలా చూసుకున్నా ఈ వారాంతానికి ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. హనుమంతుడు లుక్ తోనే ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ తప్ప ఎమోషన్స్ లేవనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత రాబడుతుందనేది చూడాలి. 

Prabhas
Krithi Sanon
Sunny Singh
Dev Datta
Adipurush Movie
  • Loading...

More Telugu News